బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ నిప్పులు చెరిగారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యూపీలో జరుగుతున్న మహా కుంభ మేళాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఫైర్ అయ్యారు. దిగజారుడు కామెంట్స్ ఇక నుంచి చేయడం మానుకోవాలని సూచించారు. ఖర్గే వ్యాఖ్యలు లక్షలాది హిందూ భక్తుల మనోభావాలను కించ పరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. మహా కుంభ మేళా సాంస్కృతిక ప్రాముఖ్యను దెబ్బ తీస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు.