మహిళా క్రికెట్ లో వరల్డ్ రికార్డ్ సృష్టించింది తెలంగాణకు చెందిన బిడ్డ గొంగడి త్రిష. మహిళల 19 ప్రపంచక ప్ లో భాగంగా కౌలాలంపూర్ లో స్కాట్లాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. కేవలం 53 బంతులు ఎదుర్కొని సూపర్ సెంచరీ చేసింది. అండర్ 19 టీ20 ఫార్మాట్ లోసెంచరీ చేసిన తొలి మహిళా బ్యాటర్ గా త్రిష చరిత్ర సృష్టించింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 208 రన్స్ చేసింది.