మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుతున్నారా అని ప్రశ్నించారు. బాగా చదివి మంచి మార్కులు సాధించి ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.