మెట్‌పల్లి: జగ్గాసాగర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సుద్దాల సుజాతకి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ నర్సింగ్ అధికారిగా ప్రశంస పత్రం ప్రధానం చేశారు. ఈ సందర్భంగా జగ్గాసాగర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్య అధికారి డాక్టర్ ఎల్లాల అంజిత్ రెడ్డి, గ్రామస్తులు ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు .ఈ కార్యక్రమంలో పుల్ల జగన్ గౌడ్, డాకురి వెంకటేష్, గొల్లపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.