సీఎం నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. తనపై ఉన్న కేసులను సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. పిటిషన్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు జస్టిస్ బేలా త్రివేది. దీనిపై ఒక్క మాట మాట్లాడినా భారీగా ఫైన్ వేస్తామని, తప్పుడు పిటిషన్ అంటూ మండిపడ్డారు. ఎలా దాఖలు చేస్తారంటూ ప్రశ్నించారు. కాగా సీఐడీ కేసులు సీబీఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు లాయర్ బాలయ్య దావా దాఖలు చేశారు.