తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికులు. ఆయన ఒంటెద్దు పోకడ పోతున్నాడని, హక్కులను కాలరాస్తూ నియంత లాగా వ్యవహరిస్తున్నాడని వాపోయారు. ఇప్పటి వరకు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. అందుకే ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 9 వరకు వేచి చూస్తామని, ఆ తర్వాత నిరవధిక సమ్మె చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.