హిందూ దేవతలను అవమానించారనే ఆరోపణలపై ప్రముఖ జర్నలిస్ట్ రాణా అయూబ్ పై కేసు నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. 2013, 2014, 2015, 2022 సంవత్సరాలలో ప్రత్యేకించి హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కావాలని కించ పరిచేలా కామెంట్స్ చేస్తున్నారంటూ హిందూ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కీలక తీర్పు చెప్పింది