భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ కాలం తర్వాత దేశీవాళి టోర్నీలో ఆడనున్నాడు. బీసీసీఐ దెబ్బకు స్టార్ ఆటగాళ్లు తమ నిర్ణయం మార్చుకున్నారు. కోహ్లీ ఢిల్లీ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈనెల 30న రైల్వేస్ తో ప్రారంభం అయ్యే మ్యాచ్ లో తను పాల్గొంటాడు. ఆస్ట్రేలియా టూర్ సందర్బంగా సీనియర్ క్రికెటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ప్రతి ఒక్కరు దేశీవాళి టోర్నీలలో పాల్గొంటేనే జాతీయ జట్టుకు ఎంపిక చేస్తామని ప్రకటించింది బీసీసీఐ.