దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర కేస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభమైంది. నాగోబాకు మైస్రం వంశీయులు మహా పూజ చేశారు. వచ్చే నెల ఫిబ్రవరి 4వ తేదీ వరకు జాతర కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. 600 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నాగోబా జాతర సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.