తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పుష్ప-2 మూవీ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సినిమా థియేటర్లకు 16 ఏళ్ల లోపు వయస్సు కలిగిన పిల్లలను సెకండ్ షోస్ కు అనుమతించ వద్దని ఆదేశించింది. ప్రభుత్వం దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా బెనిఫిట్ షోస్ కు అనుమతి ఇవ్వవద్దని కోరుతూ తెలంగాణ జర్నలిస్ట్ సతీష్ కమాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు.