ఢిల్లీలోని బురారీలో నాలుగంతస్తుల భవనం కుప్ప కూలింది. ఘటన సమయంలో భవనంలో దాదాపు 20 మంది కార్మికులు చిక్కుకున్నట్లు అంచనా. ఇప్పటి వరకు 10 మందిని రక్షించారు రెస్క్యూ టీమ్స్. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీఎం అతిషి, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.