నెల్లూరు జిల్లా జైలు అధికారి ఆడియో అంటూ మీడియాలో వస్తోన్న ఆరోపణలపై హోం మంత్రి అనిత స్సందించారు. విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని జైళ్ల శాఖ డీజీ కుమార్ విశ్వజిత్ ను ఆదేశించారు. మాజీ ఖైదీ బంధువు, జైలు అధికారి మధ్య సంభాషణగా వస్తున్న కథనాలపై నిగ్గు తేల్చాలన్నారు. మిలాఖత్ ల కోసం ఖైదీల బంధువుల నుంచి అవినీతికి పాల్పడినట్లు తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.