మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి
NEWS Jan 27,2025 06:32 pm
మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని కోరుతూ ప్రిన్సిపల్ వెంకయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలలోనే అర్హత, అనుభవం గల అధ్యాపకులు ఉంటారని నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. విద్యార్థులకు బస్సు పాసులు, ఉపకార వేతనాలు అందించబడతాయన్నారు. కార్యక్రమంలో జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ దేవన్న, రాజేందర్, మనోజ్ కుమార్, అంజయ్య, గట్టయ్య, శ్రీకాంత్, సత్తయ్య తదితరులున్నారు.