రాజమండ్రి దగ్గరలో ఉన్న వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ది చెందింది. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా వినుతికెక్కారు. స్వామి వారిని ఏడు వారాల పాటు ప్రదర్శన చేస్తే కోరుకున్నది దక్కుతుందని బుచ్చయ్యపేట మండల ఏఎన్ఆర్ హెల్పింగ్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. నియమ నిష్టలతో మొక్కుకుంటే స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని పేర్కొన్నారు. ఈ గుడికి వెళ్లేందుకు అనకాపల్లి రైల్వే స్టేషన్ నుండి రాజమండ్రి వరకు రవాణా సదుపాయం ఉంది.