తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేక పోతే ఫిబ్రవరి 9 నుంచి బస్సులు బంద్ చేస్తామంటూ అల్టిమేటం ఇచ్చారు. ఆర్టీసీ యాజమాన్యానికి డెడ్ లైన్ విధించారు ఆర్టీసీ కార్మిక సంఘాలు. ఆర్టీసీని మెల మెల్లగా ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో తమ పొట్ట కొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పని భారం పెంచుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వాపోయారు.