కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజా యుద్ద నౌక గద్దర్ పై నోరు పారేసుకున్నారు. ఆయనకు పద్మ అవార్డు ఇచ్చేది లేదన్నారు. పద్మ పురస్కారాల్లో కేంద్రం వివక్ష చూపించిందంటూ మోడీ సర్కార్ పై చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. తను చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. రాష్ట్ర సర్కార్ పంపిన పేర్లను పరిశీలించి, అర్హులకే అవార్డులు ఇస్తుందన్నారు. ఎందరో బీజేపీ నేతలను చంపిన వ్యక్తుల్లో గద్దర్ కూడా ఒకరని, ఆయనకు పురస్కారం ఎలా ఇస్తామన్నారు బండి.