ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలని అనుకునే వారికి మార్చాలని అనుకునే వాళ్లకు మధ్య పోరాటం జరుగుతోందన్నారు. మోడీ ప్రధాని అయినప్పటి నుంచి రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 143 కోట్ల ప్రజలతో రాజ్యాంగం ముడి పడి ఉందన్నారు. ఇండోర్ లో జరిగిన జై బాపు జై భీం జై సంవిధాన్ ర్యాలీలో సీఎం పాల్గొన్నారు.