బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. బీసీ ఆత్మీయ సభలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చాకనే బహుజనులకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఏ పార్టీ కూడా వారిని పట్టించు కోలేదన్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అత్యధిక పదవులు కల్పించడం జరిగిందని చెప్పారు. బీసీలంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.