దివాళా అంచున ఏపీ రాష్ట్రం చేరుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టుపై స్పందించారు. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గత జగన్ రెడ్డి సర్కార్ అందినంత మేర అప్పులు చేసిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను కూడా తాకట్టు పెట్టారని ఆవేదన చెందారు. గత ఐదేళ్ల కాలంలో వచ్చిన డబ్బులను ఏం చేశారో ఎవరికీ తెలియదన్నారు. తాము వచ్చాక గాడిన పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. మొత్తంగా ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.