గద్దర్ నక్సలైట్ అని, ఆయనకు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తి లేదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గద్దర్ గురించి ఏం అర్హత ఉందని మాట్లాడారంటూ ప్రశ్నించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యమ నేపథ్యం లేని బండికి నోరు పారేసు కోవడం తప్పా ఏమీ తెలియదన్నారు. ప్రజల పట్ల, తెలంగాణ ప్రాంతంపై అభిమానం లేని తనను ప్రజలు క్షమించరని అన్నారు.