తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గద్దర్ గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ నక్సలైట్ అంటూ పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రం నుంచి ఇద్దరని కేంద్ర మంత్రులను చేస్తే ఉపయోగం ఏముందంటూ ప్రశ్నించారు. గద్దర్ గురించి ఇంకోసారి మాట్లాడితే ఊరుకోమన్నారు.