హైద్రాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హారతి ఇస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పటాకులు పేల్చుతుండగా నిప్పురవ్వలు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోటులో ఉన్న సుమారు పది మందికి గాయాలయ్యాయి. కొంత మందిని యశోద ఆస్పత్రికి, మరికొందరిని గాంధీ, సరోజనీ ఆస్పత్రులకు తరలించారు. ఘటనలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గణపతి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితులను పరామర్శించారు మంత్రి, బీజేపీ నేతలు.