తిరుమల క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 74 వేల 742 మంది దర్శించుకున్నారు. 22 వేల 466 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.67 కోట్లు వచ్చిందని వెల్లడించారు ఈవో శ్యామల రావు. స్వామి వారి దర్శనం కోసం ప్రస్తుతం భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, టికెట్లు లేని భక్తులకు 6 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.