బాన్సువాడ ఎస్సీ బాలికల హాస్టల్లో సబ్ కలెక్టర్ కిరణ్మయి గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ చేశారు. దేశానికి స్ఫూర్తినిచ్చిన అంబేద్కర్ గొప్ప రాజానీతి కలిగిన మహనీయుడని కొనియాడారు. అంబేద్కర్ అందరికీ ఆదర్శం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బంగారు సాయిలు, మాల మహానాడు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు విజయ్, బాన్సువాడ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నర్సింలు, ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం ఉపాధ్యక్షుడు బంగారు మైసయ్య పాల్గొన్నారు.