కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మోదీ బొమ్మ పెట్టాలని, ఇందిరమ్మ పేరు మార్చాలని, లేకుంటే కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదని వ్యాఖ్యలు చేయడం బాధ్యతా రాహిత్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రధాని మోదీ బొమ్మ పెట్టేది లేదని, నిధులు ఎలా ఇవ్వరో చూస్తామని వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలపై బీజేపీ నాయకులు మతి స్థితిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.