4న రథ సప్తమి..ప్రివిలేజ్ దర్శనాలు రద్దు
NEWS Jan 27,2025 03:52 am
తిరుమలలో ఫిబ్రవరి 4న రథ సప్తమి జరుగుతుందని తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ఈ సందర్బంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఏఈవో, జేఈవోలను ఆదేశించారు. పాత భవనాలను పునర్ నిర్మించడం జరుగుతుందన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు చెందిన సిఫారసు లేఖలు తీసుకోమన్నారు ఈవో.