ఏపీ గవర్నర్ తో సీఎం భేటీ
NEWS Jan 27,2025 03:37 am
సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, దావోస్ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించి వచ్చిన పెట్టుబడులు, మిగిలి పోయిన నామినేటెడ్ పోస్టుల భర్తీ, తదితర అంశాల గురించి గవర్నర్ కు వివరించారు. రాష్ట్రాన్ని ఐటీ, లాజిస్టిక్, పరిశ్రమలకు హబ్ గా తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.