నటుడు బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు. తన తల్లిదండ్రుల స్మృత్యర్థం ఏర్పాటు చేసిన బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా లక్షలాది మంది జీవితాలకు సాంత్వన చేకూరుస్తున్నందుకు అభినందించారు. రాబోయే రోజుల్లో బాలకృష్ణ మరిన్ని అవార్డులు , పురస్కారాలు అందుకోవాలని కోరారు రాజు.