సంపదను సృష్టించి పేదలకు పంచుతామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఆరు నూరైనా సరే ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆరోపించారు. అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ పాలన పట్ల సంతోషంగా ఉన్నారని చెప్పారు.