తన తండ్రి నందమూరి తారక రామారావుకు భారత రత్న ఇవ్వాలని కోరారు నటుడు నందమూరి బాలకృష్ణ.పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన అరుదైన నాయకుడు అని పేర్కొన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ సాధించిన విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. కాగా తనకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.