అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండలం వీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. సంస్థకు చెందిన పర్రె గణేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని దివ్యాంగుల సమక్షంలో కేకు కట్ చేశారు. వృద్దాశ్రమంలో వృద్దులు, దివ్యాంగులకు స్వీట్లు పంపిణీ చేశారు. సామాజిక, సేవా కార్యక్రమాలను చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు పర్రె గణేశ్. రాబోయే రోజుల్లో మరిన్ని చేపడతామని చెప్పారు.