సిఐకి మార్కాజి ఇంతేజమి కమిటీ సన్మానం
NEWS Jan 26,2025 02:52 pm
మెట్‌పల్లి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికైన సందర్బంగా పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెట్‌పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ అధ్యక్షులు అక్తర్ జానీ సీఐని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ ఆఫీస్, అడ్వకేట్ రజాక్, మొహీం, రైస్, హకీమ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.