గూడెంలో షబ్బీర్ అలీ ప్రజా పాలన సమావేశం
NEWS Jan 26,2025 01:56 pm
కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో ప్రజా పాలనలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు పథకాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రారంభించారు. లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు అందజేశారు. ప్రభుత్వానికి ఎన్ని ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తామని, పథకాలు అమలులో సీఎం రేవంత్ కృషి చేస్తున్నారన్నారు.