నిజామాబాద్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు
NEWS Jan 26,2025 12:55 pm
భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి,పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తెలిపారు. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా,భూపతి రెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.