మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై చేసిన కామెంట్స్ కు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఆమెకు అంత సీన్ లేదన్నారు. తను రీల్స్ చూసుకొని కాలక్షేపం చేస్తే మంచిదని హితవు పలికారు. కూటమి సర్కార్ కొత్త ఉద్యోగాలు ఇవ్వడం మాటేమో కానీ ఉన్న వారిని తీసేయడం పనిగా పెట్టుకుందన్నారు. ఈ ఎనిమిది నెలల కాలంలో ఏకగా 4 లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపించిందన్నారు.