గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఢిల్లీలో. ఈ సందర్బంగా ప్రపంచ ప్రఖ్యాతమైన ఏపీకి చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీతో సహా ప్రముఖులందరిని ఆకట్టుకున్నది. పర్యావరణ హితమైన, సహజ సిద్ధమైన వనరులతో చేసిన ఏటికొప్పాక బొమ్మలు ఆంధ్రప్రదేశ్ కళాకారుల సృజనాత్మకతకు మారుపేరుగా నిలుస్తున్నాయి. బొమ్మలమ్మ బొమ్మలు అంటూ సాగే పాటతో శకటం ముందుకు సాగింది. ఈ సందర్బంగా దీనిని తయారు చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించారు సీఎం.