అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారెంటీలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే పేదలను ఆదుకుంటామని తెలిపారు. కోట్లాది రూపాయల ఖర్చుతో నాలుగు పథకాలు ప్రారంభించామన్నారు. పంటకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు. భూమి లేని పేదల పరిస్థితి చూసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామని చెప్పారు. ఇంటింటికి సన్నబియ్యం త్వరలో పంపిణీ చేస్తామని వెల్లడించారు.