తిరుమలలో ఆరాధనా మహోత్సవాలు
NEWS Jan 26,2025 06:19 am
కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందర దాసుల ఆరాధనా మహోత్సవాలు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా జరుగనున్నాయి. సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు, పురందర సాహిత్య గోష్ఠి, వివిధ పీఠాధిపతుల మంగళా శాసనాలు, సంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్బంగా టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.