మాజీ సీఎంకు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్ . సత్యనారాయణ ఆదివారం కన్ను మూశారు. ఆయన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సభ్యుడిగా కూడా పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో రెండవ దశలో కీలక పాత్ర పోషించారు. జర్నలిస్ట్ గా గుర్తింపు పొందారు. ఆయన దీర్ఘ కాలిక అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తన వయసు 58 ఏళ్లు. సంగారెడ్డిలో తన ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు.