చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు రఘుపతి, చల్లా లక్ష్మణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చేగుంట ఎమ్మార్వో నారాయణ మాట్లాడుతూ.. ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మాక్ పోలింగ్ నిర్వహించడం ద్వారా విద్యార్థులలో ఓటు ప్రాధాన్యత, ఓటింగ్ ప్రక్రియ గురించి తెలుసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నీరజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.