భారత ప్రభుత్వం అరుదైన ఘనతను సాధించిందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. తనతో పాటు నలుగురు కేంద్ర మంత్రులు, మూడు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొన్నారని తెలిపారు. దావోస్ పర్యటనలో టీమిండియా ఏకంగా రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించడం జరిగిందన్నారు. ఇది గతంలో ఎన్నడూ లేదన్నారు. మోడీ నేతృత్వంలో ఇండియా బ్రాండ్ కు దక్కిన గౌరవమన్నారు.