మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యత్వానికి, రాజ్యసభ పదవికి విజయ సాయి రెడ్డి రాజీనామా చేయడం బాధ కలిగించిందన్నారు. పార్టీకి ఆయన ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఇది ఊహించని పరిణామమని, పార్టీకి భారీ నష్టం కలుగుతుందని చెప్పారు. వైసీపీకి వెన్నెముక లాంటి వాడని, అదే లేక పోతే ఎలా అని ప్రశ్నించారు. తను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. మొత్తంగా తను లేక పోవడం పార్టీకి తీరని లోటుగా అభివర్ణించారు.