భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు.కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిపై భగ్గుమన్నారు. స్థాయికి తగినట్లుగా మాట్లాడక పోవడం దారుణమన్నారు. ఉన్నతమైన పదవిలో ఉంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడులు తీసుకు వచ్చారని అన్నారు. జీర్ణించుకోక పోవడం పట్ల ఫైర్ అయ్యారు ఎంపీ. మంచి పద్దతి కాదని హితవు పలికారు.