2024వ సంవత్సరంలో ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించినందుకు గాను “ఉత్తమ ఎన్నికల నిర్వహణ పురస్కారం” అందుకున్నారు చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు.15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ సీఎస్ విజయ కుమార్ చేతుల మీదుగా అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఎస్పీ చేసిన సేవలు ప్రశంసనీయమని, బాధ్యతాయుతంగా వ్యవహరించి పేరు తీసుకు రావాలని కోరారు సీఎస్.