మంత్రి వంగలపూడి అనిత విశాఖ బాలికల సదన్ ను సందర్శించారు. తాజా పరిస్థితులపై ఆరా తీశారు. అక్కడ ఉంటున్న బాలికలతో మాట్లాడారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 56 మంది ఉన్నారని, వారంతా శిక్షణ తీసుకుంటున్నారని చెప్పారు. ఇద్దరిని ఇంటికి పంపించారని చెప్పారు. మరో ఇద్దరిని బాలికల హోంకు పంపించారని తెలిపారు. ఇందులో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారని అన్నారు. కొంత మంది చిన్నారులు ఉన్నారని వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించారు.