టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి రాజీనామాపై స్పందించారు. ఇదంతా జగన్, ఎంపీ కలిసి ఆడుతున్న డ్రామా అంటూ మండిపడ్డారు. జగన్ కు తెలిసే జరుగుతోందని, దాని వెనుక బిగ్ ప్లాన్ ఉందన్నారు. తమపై నమోదైన కేసులను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి నాటకాలకు తెర లేపారంటూ ధ్వజమెత్తారు. రాజీనామాలు చేసినా విదేశాలకు వెళ్లినా చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ జరపడం ఖాయమన్నారు.