రేవంత్ సర్కార్ పట్టింపులేని పరిస్థితితో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు ఇవ్వకపోయినా రైతులు కష్టపడి పంటలు పండిస్తే గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని విమర్శించారు. నామమాత్రపు కొనుగోలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. పాలకులకు శ్రద్ధ లేకపోవడంతో ఆదిలాబాద్‌లో సాగు తగ్గుతున్నదని చెప్పారు. బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ సభ్యులతో కలిసి ఆదిలాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.