వైసీపీతో పాటు రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తు వ్యవసాయమేనని స్పష్టం చేశారు. పొలం పనులు చేసుకుంటూ కాలం గడుపుతానని అన్నారు. రాజకీయాల నుంచి తప్పు కోవడం వెనుక ఎవరి ఒత్తిళ్లు లేవన్నారు. ఇంకొకరు చెబితే తాను నిర్ణయం తీసుకునే చిన్న పిల్లాడిని కానన్నారు. ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని, తాను పదవి కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు విజయ సాయి రెడ్డి.