వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. తను అప్రూవర్ గా మారడం ఖాయమని జోష్యం చెప్పారు. అంతే కాకుండా మాజీ సీఎం జగన్ రెడ్డిపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తను డిస్ క్వాలిఫై అవ్వడం పక్కా అన్నారు. పులివెందుల శాసన సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయని స్పష్టం చేశారు. జగన్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన అక్రమాలపై కూటమి సర్కార్ విచారణ చేపడుతుందన్నారు.