తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో మృతి చెందిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన భక్తురాలికి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు రూ. 25 లక్ష పరిహారం అందజేశారు. ఈ ఘటన జనవరి 8న చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం మెట్టు సేలకు చెందిన మల్లిక కుటుంబాన్ని పరామర్శించి చెక్కు అందించారు.